చలికాలం పోతూ పోతూ జనాన్ని ఇబ్బందిపెడుతోంది. ఆంధ్రాలో కనిష్ట ఉష్షోగ్రతలు పడిపోతున్నాయి. అలాగే, ఒడిశాకు అనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్య కోస్తా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి.
విశాఖ జిల్లాలోని చింతపల్లిలో అత్యంత కనిష్ఠంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో ఇక్కడ నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చలి కారణంగా జ్వరాలు, ఫ్లూ లాంటివి పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కేసుల తీవ్రత పెరుగుతోంది. చలి నుంచి రక్షణకు స్వెట్టర్లు, మఫ్లర్లు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల వెంట చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం ఉద్యోగాలకు, కూలిపనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.