Eye Operation: గ్రేటర్ నోయిడాలో వైద్యులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. మొత్తం వైద్యరంగం సిగ్గుపడేలా సంఘటన జరిగింది. నిజానికి, ఎడమ కన్ను చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 7 ఏళ్ల చిన్నారికి మత్తుమందు ఇచ్చి కుడి కంటికి ఆపరేషన్ చేశారు. అంతే కాదు.. ఈ ఆపరేషన్ కోసం చిన్నారి కుటుంబం నుంచి రూ.45 వేలు కూడా వసూలు చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకోగానే పిల్లాడిని కుటుంబ సభ్యులు గమనించారు. అనంతరం ఈ విషయమై…
ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా హర్సూద్ మున్సిపల్ కౌన్సిల్ సీఎంఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కాల్పుల ఘటన కలకలం రేపింది. పిస్టల్‌తో వచ్చిన రోజువారీ వేతనంపై పనిచేస్తున్న డ్రైవర్, మహిళా సీఎంఓ (ముఖ్య మున్సిపల్ అధికారి)పై వరుసగా 3 రౌండ్లు కాల్పులు జరిపాడు.
Bihar: బీహార్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా పిడుగుపాటుకు పలువురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
Odisha : ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని గత ఐదు రోజుల్లో దాదాపు లక్ష మంది ప్రజలు కలిశారు. వీరిలో రాష్ట్రంలోని నలుమూలల నుండి పిల్లలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఉన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మావతి ఎపిసోడ్ చేరుకుంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో నుంచి కాల్ వచ్చిందట.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం కాబోతున్నారట.. ఇప్పటికే తాను పోటీ చేయను అంటూ అధిష్టానం పెద్దలకు వసంత చెప్పినట్టు సమాచారం అందుతుండగా.. ఇప్పటికే పలుమార్లు వసంతను సీఎంవోకి రావాలని పిలిచినా వెళ్లని ఆయన.. ఈ రోజు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.