ప్రాజెక్టుల కోసం అదనపు సిబ్బంది నియామకం..! సీఎం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల దగ్గర సమగ్ర పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణ పరిస్థితులు సరిదిద్దాలన్నారు. రాష్ట్ర విభజన నుంచి వీటి గురించి పట్టించుకోలేదు.. దీని వల్ల ముప్పు పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా తగినంత మంది నిర్వహణా సిబ్బంది ఉన్నారా లేదా అనే లెక్కలు తీయాలని.. అవసరమైన సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు.. ఇక, గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల పురోగతిని కూడా సమీక్షించారు సీఎం వైఎస్ జగన్.. సీఎస్ అధ్యక్షతన జవనరుల శాఖ స్పెషల్ సీఎస్, ఇంజినీర్‌ఇన్ ఛీఫ్, రెవిన్యూ–విపత్తు నిర్వహణ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఇప్పటికే కమిటీ ఏర్పాటు కాగా.. జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్‌గా ఐఐటీ, జేఎన్టీయూ నిపుణులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు..
Read Also: అన్ని డిమాండ్లకు అంగీకారం.. సుదీర్ఘ పోరాటానికి తెరదించిన రైతులు
Also Read
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్‌న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
వివిధ ప్రాజెక్టులు, నిర్వహణలపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా పరిశీలిస్తోంది అత్యున్నతస్థాయి కమిటీ.. తాజాగా వచ్చిన వరదలను, కుంభవృష్టిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన సూచనలు చేయనున్నారు.. ఆటోమేషన్ రియల్‌టైం డేటాకూ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపై చీఫ్ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టి సారించిదని సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు అధికారులు.. అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించనున్నారు.. వాటర్ రెగ్యులేషన్ కోసం సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.. పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తి, ప్రాణ నష్టానికి ఆస్కారమున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించే పనిని కూడా కమిటీ చేస్తోందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..