CM YS Jagan Responds On Vatticherukuru Tractor Incident: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు రూ. 1 లక్ష ఆర్ధిక సాయం.. అలాగే స్వల్పంగా గాయపడిన వారికి వైద్యచికిత్సలతో పాటు రూ. 25 వేల సాయం అందించాలని ఆదేశాలను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
LIC New Policy: ఎల్ఐసీ లో సూపర్ పాలసీ.. పురుషులు కోసమే.. బెనిఫిట్స్ ఇవే..
ఇదిలావుండగా.. వట్టిచెరుకూరు సమీపంలో ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో.. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ట్రాక్టర్‌లో సుమారు 40 మంది ఓ శుభకార్యం కోసం బయలుదేరారు. కొండేపాడు నుంచి జూపూడికి వెళ్తున్న సమయంలో.. అనుకోకుండా ఇది అదుపు తప్పింది, ఈ ప్రమాదం జరిగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వెంటనే దగ్గరలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతిచెందిన వారు ప్రత్తిపాడు మండలం కొండపాడుకు చెందిన వారిగా గుర్తించారు.
Nadendla Manohar: జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తారు
ఈ ఘటనపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ట్రాక్టర్ బోల్తా దుర్ఘటన దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం పాలవడం తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శుభకార్యానికి వెళ్తున్న బృందం ప్రమాదం బారిన పడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.