ఈ మధ్య కాలంలో భీమా కంపెనీలు మార్కెట్ లో రోజుకొకటి పుట్టుకోస్తున్నాయి.. అయితే కొన్ని పాలసీలు లాభాలను అందిస్తున్నాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎల్ఐసి.. దేశంలోనే అతి పెద్దగా భీమా కంపెనీ.. ఎన్నో రకాల పథకాలను అందిస్తూ వస్తుంది.. ఇప్పటికే రకాల పథకాలను అందిస్తూ వస్తుంది.. తాజాగా మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ పాలసీ పురుషుల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు.. ఇక ఆ పాలసీ పూర్తి వివరాలను తెలుసుకుందాం..
తాజాగా ఆధార్ స్థంబ్ పాలసీ పేరుతో సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎల్ఐసీ ఆధార్ స్టాంబ్ అనేది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత హామీ పొదుపు ప్లాన్. ఇది సరసమైన ప్రీమియం రేటుతో పురుష దరఖాస్తుదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఏదైనా సంఘటన జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది.. భీమా బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా మీకోసం..
*. బీమా చేసిన వ్యక్తి దురదృష్టవశాత్తూ అకాల మరణం సంభవిస్తే నామినీ లేదా లబ్ధిదారుడు మరణ ప్రయోజనానికి అర్హులు. ఇది బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ లాయల్టీ అడిషన్‌కు సమానంగా ఉంటుంది. లాయల్టీ అడిషన్ అనేది పాలసీ ఫండ్ విలువ నుంచి చెల్లించబడే బోనస్ కూడా అందుతుంది..
*. ఇకపోతే పాలసీదారుడు పాలసీ వ్యవధిని జీవించి ఉన్నట్లయితే వారు మెచ్యూరిటీ ప్రయోజనానికి అర్హులు. ఇది బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ లాయల్టీ అడిషన్‌కు ఇక్వల్ గా ఉంటుంది..
*.పాలసీ మొదటి రెండు సంవత్సరాల తర్వాత పాలసీ యొక్క సరెండర్ విలువపై పాలసీదారు రుణాన్ని పొందవచ్చు..
పాలసికి అర్హులు..
ఈ పాలసీ కొనుగోలు చెయ్యాలనుకొనేవారికి 8 ఏళ్లు ఉంటే సరిపోతుంది..గరిష్ట వయస్సు 55 ఏళ్లు.. టర్మ్ పాలసీ 10 నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుంది.. మెచ్యూరిటీలో కనీస వయస్సు18 సంవత్సరాలు ఉంటుంది..మైనర్ జీవితానికి సంబంధించిన పాలసీని జారీ చేస్తే 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా వెంటనే వచ్చే పాలసీ వార్షికోత్సవం నాడు ఆ పాలసీ ఆటోమేటిక్‌గా లైఫ్ అష్యూర్డ్‌కి చెందుతుంది. అలాంటి వెస్టింగ్‌పై వారి మధ్య ఒప్పందంగా పరిగణిస్తారు.. ఎటువంటి రిస్క్ ఉండదు..మరింత సమాచారం కొరకు దగ్గరలోని ఆఫీస్ ను సందర్శించండి..