CM YS Jagan Mohan Reddy Speech In Kovvuru Public Meeting: తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని, తోడేళ్లంతా కలిసి ఒక్క జగన్‌పై వస్తున్నారని, తనకు తోడుగా ఉండాలని కోరారు. తొలుత ఆయన జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేశారు. దీని ద్వారా 9.95 లక్షల విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 9.95 లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీఎంబర్సమెంట్ కింద రూ.703 కోట్లు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు విద్యాదీవెన పథకం కింద తల్లుల ఖాతాల్లో 10,636 కోట్లు జమ చేశామని.. దాంతో 26 లక్షల మంది విద్యార్థులకి లబ్ది చేకూరిందని తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెనల ద్వారా రూ.14,912 కోట్లు జమ చేశామని తెలిపారు. పిల్లల చదువు కోసమే తాము ఇంత ఖర్చు చేశామన్నారు.
Karnataka: మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. సీఎం నివాసం ఎదుట ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన
చదువు ఒక్కటే పేదరికం నుంచి బయటపడేందుకు మార్గమని.. నాలుగేళ్లుగా చదువుల విప్లవం వైపు అడుగులు వేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. మీరు చదవండి, ఎంత ఫీజైనా మేము చల్లిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని వివరించారు. ఈ విషయాన్ని జ్ఞానం లేని ప్రతిపక్షాలు గ్రహించాలని సూచించారు. జూన్ నుంచి 15,750 స్కూళ్లలో డిజిటల్ విద్యా బోధన ప్రారంభిస్తున్నామన్నారు. ఒక సత్యనాదెళ్ల గురించి మాట్లాడటం కాదని.. రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఒక సత్యనాదెళ్ల రావాలని పిలుపునిచ్చారు. అందుకే తాము విదేశీ విద్యకు ఒక్కో విద్యార్థికి 1 కోటి 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో పథకానికి దాదాపు 2వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, విద్యాకానుక కిట్లను కూడా అందజేస్తున్నామని అన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒప్పందం చేసుకొని, విద్యార్థుల స్కిల్స్ డెవలప్ చేస్తున్నామన్నారు. కెరీర్ ఓరియెంటెడ్‌గా డిగ్రీ కోర్సుల్లో మార్పులు తెచ్చామని, ఈ జూన్‌కల్లా నాడు-నేడు పూర్తవుతుందని స్పష్టం చేశారు.
Etela Rajender: నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు?
రాష్ట్ర అప్పులు గ్రోత్ రేట్ గతంలో కంటే చాలా తక్కువగా ఉందని సీఎం జగన్ వివరించారు. నాలుగేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలతో అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిందన్నారు. అయితే.. గత ప్రభుత్వం పేదవాళ్ల గురించి ఆలోచించలేదని, గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారని, దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే వాళ్ల పాలసీ అని విమర్శించారు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారు అప్పుడెందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పుడు జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదని.. క్లాస్ వార్ అని.. ఒకవైపు పేదవాళ్లు, మరోవైపు పెత్తందార్లు ఉన్నారని చెప్పారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలని, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే జగనన్నకు సైనికులుగా ఉండాలని సీఎం జగన్ కోరారు.