Etela Rajender: నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. వేల కోట్ల భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్ చేసేవారని అన్నారు. అవన్నీ కేసీఆర్ అనుచరులకు అప్ప చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు అని చెప్పేవాడని గుర్తు చేశారు. అనంత గిరిగా లకోమ్ మరిజోమ్ క దవా అని చెప్పేవారని అన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల కోసం 111 జీవో తీసివేస్తా అంటున్నాడని మండిపడ్డారు. నిజాం కాలంలో 1908 లో హైదరాబాద్ కు వరదలు వచ్చి 15 వేల మంది చనిపోయారని తెలిపారు. ఆ తర్వాత జంట జలాశయాలు నిర్మాణము చేశారని అన్నారు. దీనితో వరద నివారణ, తాగునీరు, పర్యావరణ పరిరక్షణ, భూగర్భజలాలు లాంటి నాలుగు ప్రయోజనాలు వచ్చాయని అన్నారు.
ఇప్పుడు గోదావరి కృష్ణ నుంచి నీళ్లు వస్తున్నాయి అంటున్నారు.. కేసీఆర్ అనుచరులు వేల కోట్ల రూపాయలు లబ్ది చేకూరాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు రైతుల దగ్గర భూములు లేవు, 18 వేల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లో ఎంత ఎండ ఉన్నా సాయంత్రం అయ్యే సరికి చల్లబడడానికి కారణం అక్కడ ఉన్న చెట్లు అని అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తక్షణమే ఆపివేసి… సమీక్ష చేయాలని కోరారు. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతే ఆగిపోయిందని, ఇప్పుడు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతే ఆగిపోతుందని ఈటెల పేర్కొన్నారు. ధరణి రైతుల కొంప ముంచిందని, దరణిలో 14 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారని, ఎన్నో తప్పులు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ రైతులు నిశ్చింతగా నిద్ర పోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 613 మియాపూర్ భూములు ఏమయ్యాయి? నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వేల కోట్ల భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్ చేసేవారని అన్నారు. అవన్నీ కేసీఆర్ అనుచరులకు అప్ప చెబుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.
మియాపూర్ స్కాం ఎందుకు బయట పెట్టట్లేదని? ప్రశ్నించారు. ఇలా వచ్చిన డబ్బుతో రాబోయే రోజుల్లో రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. నాలాంటి వాళ్ళ గొంతు కోయాలని ఓటు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఆరోపణలు గుప్పించారు. కొత్త సచివాలయంలో ఎమ్మెల్యే లకు కూడా అనుమతి లేదు, సామాన్య పబ్లిక్ కు అసలు అనుమతి లేదని మండిపడ్డారు. నిన్న మొన్న కొన్ని వార్తలు చూశానని, మా అధ్యక్షుడికి, తనకు గొడవ అయినట్టు, సెల్ ఫోన్ లు విసిరి వేసుకున్నట్టుగా వార్తలు రాసారని మండిపడ్డారు. ఇలాంటి పనులు తను చేయనని స్పష్టం చేశారు. చాలా ఊహాగానాలు వస్తున్నాయని, నిన్నటి వరకు కాంగ్రెస్ లేవదని చర్చ జరిగిందని గుర్తు చేశారు. కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలుస్తుందా? అంటూ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లోకి వెళ్లారని గుర్తు చేశారు. రేపు కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలుస్తాయి ఏమో అని ప్రచారం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడు బాగానే పని చేస్తున్నారని, బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఇంకా శక్తి కావాలి అంటున్నామని ఈటెల రాజేందర్ తెలిపారు.
Miserable Countries: ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశాలు