Cm Jagan mohan reddy Review ఏపీలో మహిళా శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan mohan Reddy) సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్ష చేపట్టారు. స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం ఏర్పాటు చేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణకోసం ఏర్పాటు చేసిన ఎస్‌ఎంఎఫ్ తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. అంగన్‌వాడీలకు కూడా ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు.
Read ALso: kerala Hijab Protest: కేరళను తాకిన హిజాబ్ వివాదం..ముస్లిం సంఘాల ఆందోళన
అంగన్‌వాడీ పిల్లలకు ఇప్పటి నుంచే భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలన్నారు. అన్నీ బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ ఉండాలి. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. కళ్యాణ మస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అందుకనే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టాం. అన్ని అంగన్‌వాడీలకు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ చేసిన బియ్యాన్నే పంపిణీ చేయాలన్నారు.
ఎస్‌డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలుపై పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.మానసిక వైకల్యంపై వైద్యులు టెంపరరీ సర్టిఫికెట్లు జారీ చేసినా, వారికి పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీచేయనున్నారు అధికారులు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ప్రతి ఏటా జులై, డిసెంబర్లలో మంజూరు ప్రక్రియ చేపడతారు.
మానసిక వైకల్యంపై టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఈ డిసెంబర్లో పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయాలి. దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలి.జువైనల్ హోమ్స్ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాలి. జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు సీఎం జగన్.
Read Also: Prashanna Kumar Reddy:ఎన్టీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేని అయ్యా..