పోడు సాగుకు అడ్డు వస్తున్నారని అటవీ శాఖ అధికారి శ్రీనివాసరావు ను గొత్తికోయలు హత మార్చడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇది ప్రభుత్వం చేసిన హత్య అనడం హాస్యాస్పదమని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చిన గుత్తికోయలకు ఈ ప్రాంతంపై ఎలాంటి హక్కు ఉండదనే విషయం మర్చిపోయిన రేవంత్ రెడ్డి అవగాహన పెంచుకొని మాట్లాడాలని అన్నారు మంత్రి సత్యవతి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదని మంత్రి సత్యవతి హితవు పలికారు.
Also Read : ShilpaLayout Flyover Inauguration Live: గచ్చిబౌలిలో కొత్త ఫ్లై ఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
అదేవిధంగా చనిపోయిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఆయన రిటైర్మెంట్ అయ్యేవరకు బెనిఫిట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి సత్యవతి తెలిపారు. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ దాడులు చేయిస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోడు సాగుదారులైన గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలను మహబూబాబాద్ నుండే ప్రారంభించబోతున్నామని ఆమె స్పష్టం చేశారు.
Also Read : Tips For Sinusitis : సైనస్ ని తగ్గించే ఇంటి చిట్కాలు