Cm Jagan: కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం గత రోజు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. టాలీవుడ్ కు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు పెళ్ళికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక నేడు గుంటూరు లో ఈ జంట రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యిసందడి చేశారు. నూతనవధూవరులను ఆశీర్వదించారు. జగన్ తో పాటు వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు. ఎప్పటినుంచో వైసీపీలో ఉన్న ఆలీకి ఈ మధ్యనే జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. ప్రభుత్వ ఎలక్టానిక్ మీడియా సలహాదారుగా ఆలీని నియమించారు.