CM Chandrababu: ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు..
- ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారు..
- కెమికల్స్‌తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారు..
- ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. గత పాలనలో విధ్వంసకర పరిస్థితులను చూశాం.. 2019- 2024 మధ్య అనేక దారుణాలు జరిగాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారు.. రాముడి విగ్రహం ధ్వంసం చేస్తే పరిశీలించేందుకు వెళ్తే నా పైనే దాడికి దిగారు.. కల్తీ నెయ్యి అంశంలో సిండికేట్‌గా ఏర్పడి కుట్రలు చేశారు.. సుమారు 59.71 లక్షల కేజీల నెయ్యి కల్తీ చేసి, రూ.234.51 కోట్ల నిధులను అక్రమంగా దోచేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
అలాగే, ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి.. అవినీతి గానీ, కుట్ర పూరిత ఆలోచన దీని వెనుక ఉంటుందన్నారు. కెమికల్స్‌తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారు.. ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Also Read
ఇక, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఏం జరగలేదన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తిరిగి మనల్నే క్షమాపణ చెప్పమంటున్నారు.. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీసేందుకు మొదటి నుంచి ప్రయత్నం చేశారు.. తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్లో అన్యమత ప్రచారం చేశారని ఏపీ సీఎం ఆరోపించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..