MLA Adimoolam Case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్..! వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు..!
- ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం..
- విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని భావించిన పోలీసులు..
- అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందన్న బాధితురాలు..
- వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని కోరిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Adimoolam Case: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావించారు.. అయితే, అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందని చెబుతున్న బాధితురాలు వరలక్ష్మి.. తనకు వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని ఈస్ట్ పోలీసులను కోరారు.. అనారోగ్య సమస్యలు.. గుండె నొప్పితో బాధపడుతున్న నాకు.. వైద్య పరీక్షల కోసం కొంత సమయం ఇవ్వాలంటూ రాతపూర్వకంగా పోలీసులను కోరారు వరలక్ష్మి. దీంతో అమెకు వైద్య పరీక్షలను పూర్తిగా కోలుకున్నాక నిర్వహించడానికి అంగీకరించారు పోలీసులు..
Read Also: CM Chandrababu: భారీ వర్షాలు.. 9వ రోజు సహాయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్..
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
కాగా, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.. ఎమ్మెల్యే తీరుపై బాధితురాలు మీడియాకు ఎక్కడంతో చర్చగా మారింది.. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్తపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ.. మరోవైపు.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఆదిమూలానికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించానని, చంద్రబాబు నిర్ణయం మేరకు ఒప్పుకుని ఆయన గెలుపు కోసం పనిచేసానని చెప్పుకొచ్చిన సదరు మహిళ.. ఆ తర్వాత తనను హోటల్ కు పిలిపించి అత్యాచారం చేశాడని.. ఆ తర్వాత కూడా మళ్లీ రమ్మని వేధిస్తుంటే రెండుసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లా.. మూడోసారి తన భర్త ఇచ్చిన పెన్ కెమెరాతో మొత్తం వ్యవహారం రికార్డు చేసినట్టు పేర్కొన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?