RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: రాజకీయాలు అంటే టెన్షన్‌తో కూడుకున్నవేనని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీపీ సమస్యలు వచ్చాయని, రెండోసారి గెలిచిన తర్వాత షుగర్ సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. నగరి పట్టణంలోని తన నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గంలో పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్‌లను సన్మానించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో తమ ప్రభుత్వం చేసి చూపించిందని తెలిపారు. అయితే, ఎన్నికల్లో అబద్ధాలు చెప్పలేకపోయిన కారణంగా ఓటమి పాలయ్యామని వ్యాఖ్యానించారు.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు ప్రజా సమస్యల పరిష్కారంలో విజయవంతమయ్యారని రోజా పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే విధానాన్ని జగన్ అందరికీ నేర్పించారని చెప్పారు. పుత్తూరులో గతంలో ఎంపీపీగా ఉన్న వ్యక్తి చేయలేని అభివృద్ధిని, వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్‌లు సాధించారని ఆమె ఉదాహరణగా తెలిపారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ప్రతి సర్పంచ్ నేడు గర్వంగా ప్రజల్లో తిరిగే పరిస్థితిని జగన్ సహకారంతో తాను కల్పించానని చెప్పారు. మళ్లీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లే అర్హత తమకే ఉందని, పార్టీ శక్తిని మరోసారి నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. అబద్ధాలతో గెలిచిన పార్టీలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!