Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా?
- పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పబ్లిసిటీ కోసం విద్యార్థులు చలో పార్లమెంట్ ర్యాలీ చేపట్టారన్న పోలీసుల వాదనపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల ఫుటేజీలు.. నిరసనలకు సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారా? అయితే సీసీటీవీ వీడియోలు భద్రపరచాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. జూలై 20, 21 తేదీల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీతో పాటు అన్ని సంబంధిత రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసి నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

Also Read
ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన సంఘటన కాదని, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది.
విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన న్యాయవాది.. పోలీసులపై ఆరోపణలు చేసిన వారు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవచ్చని వాదించారు. అయితే హైకోర్టు ఆ వాదనతో ఏకీభవించలేదు. ‘‘ఇది ఒక ఒంటరి సంఘటన అయితే వేరేలా చూసేవాళ్లం. కానీ ఇది అలాంటి ఘటన కాదు. కాబట్టి అధికారుల నుంచి అధికారిక సమాధానం అవసరం.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ ముగిసే వరకు ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను భద్రపరచాలని కోర్టు స్పష్టం చేసింది. సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ, ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులు, పోలీసుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం భద్రపరచాలని ఆదేశించింది.ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
పిటిషనర్ల ఆరోపణలివే
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎన్. హరిహరన్ వాదిస్తూ.. విద్యార్థులు రాజ్యాంగబద్ధమైన శాంతియుత నిరసన హక్కును వినియోగించుకుంటున్నారని, అయితే పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. పిటిషన్లలో పేర్కొన్న ముఖ్య ఆరోపణలు.. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, ఎలక్ట్రిక్ బ్యాటన్ల వినియోగం, విద్యార్థులు, మహిళలపై దాడులు, 90 మందికిపైగా నిరసనకారులు గాయపడటం, మహిళా నిరసనకారులతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. పలువురు పోలీసులు నేమ్ప్లేట్లు లేకుండా లేదా సాధారణ దుస్తుల్లో విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్లు కోర్టును కోరారు.
ప్రభుత్వం ఏమంది?
కేంద్రం, ఢిల్లీ పోలీసుల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు వాదిస్తూ.. నిరసన శాంతియుతంగా జరగలేదని, కొందరు రాళ్లు రువ్వడంతో పాటు హింసకు పాల్పడ్డారని తెలిపారు. అలాగే 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని, ఆ సమయంలో సెక్షన్ 144 అమల్లో ఉందని, పిటిషనర్లు సోషల్ మీడియాలోని కొన్ని వీడియోలను మాత్రమే ఆధారంగా చూపిస్తున్నారని, మొత్తం ఘటనను పరిగణనలోకి తీసుకోవడం లేదని వాదించారు. అయితే ఈ అంశాన్ని వ్యక్తిగత సంఘటనలుగా చూడలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘ఈ దశలో ఆరోపణలు నిజమా కాదా అన్నది మేము నిర్ణయించడం లేదు. కానీ ప్రజా నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే.’’ అని ధర్మాసనం పేర్కొంది.
సోనం వాంగ్‌చుక్ పిటిషన్‌కు నిరాకరణ
మరోవైపు వాతావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను జంతర్‌మంతర్ దగ్గర నుంచి బలవంతంగా తరలించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని ఇప్పటికే వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కోర్టు దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్న ధర్మాసనం.. అవసరమైతే సంబంధిత అధికారులను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాతే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు అంశాన్ని పరిశీలించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!