Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor Mayor Couple Murder Case: 2015లో జరిగిన చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు మరోసారి సీరియస్ అయింది. ఆరు నెలల క్రితం ఇదే కేసులో చింటూ సహా ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం.. ఇప్పుడు అధికారుల తీరుపై కఠిన చర్యలకు దిగింది. మేయర్ అనురాధ, భర్త మోహన్ హత్య కేసులో మొత్తం 160 మంది సాక్షులు ఉండగా.. వారిలో 14 మంది ప్రభుత్వాధికారుల వ్యవహారం కోర్టు దృష్టికి వచ్చింది. ఈ 14 మందిలో 8 మంది వివిధ కారణాలతో సాక్ష్యం చెప్పడానికి నిరాకరించారు. మరో 6 మంది తమ సాక్ష్యాలను మార్చి చెప్పినట్లు విచారణలో తేలింది.
Read Also: Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
Also Read
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
దీంతో ఆరు నెలల క్రితం ఉరిశిక్ష తీర్పు ఇచ్చిన కోర్టు.. ఈ 14 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అయితే, షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చినప్పటికీ.. వారి సంజాయిషీలతో సంతృప్తి చెందని కోర్టు.. 14 మంది ప్రభుత్వ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ 14 మందిపై ప్రైవేటు కేసులు నమోదు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్షలతో పాటు.. సాక్ష్యాలను మార్చిన, కోర్టుకు సహకరించని అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!