Engineers Corruption: చిత్తూరు జిల్లాలో ఆర్ అండ్ బి ఇంజనీర్ల అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. 11 మంది ఇంజనీర్లపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన చిత్తూరు ఆర్ అండ్ బీ ఎస్ఈకి చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నాసిరకం రోడ్ల నిర్మాణంతో పాటు నిబంధనలను అతిక్రమించారని అభియోగాలు వచ్చాయి. విజిలెన్స్ విచారణతో వెలుగులోకి భారీ అవినీతి కార్యక్రమాలు వచ్చాయి.
Read Also: Delhi High Court : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ
అయితే, పుంగనూరు, పలమనేరు, పీలేరు నియోజక వర్గాల్లో జరిగిన రోడ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అవసరం లేని చోట్ల కల్వర్టుల నిర్మాణం పేరుతో ప్రాజెక్ట్ కాస్ట్ ను ఇంజనీర్లు పెంచారు. చిత్తూరు ఆర్ అండ్ బీలో ఇద్దరు ఈఈలు, ఇద్దరు డీఈఈలు, ఏడుగురు ఏఈలపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ నుంచి సొమ్ము రికవరీ చేయాలని సర్కార్ పేర్కొనింది. నాణ్యతలేని కాంక్రీట్, తారు తక్కువగా వినియోగించారని నిర్ధారణ చేసింది. రూ 97.08 లక్షలు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఇక, రూ 154.40 కోట్ల అంచనాతో చేపట్టిన పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. కాంట్రాక్టర్ కు సహకరించిన ఇంజనీర్ల పాత్రను నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.