Minister Nadendla: విశాఖపట్నంలో పీడీఎస్ రైస్ గుర్తించే రాపిడ్ కిట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాం.. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి మన దేశానికి చెందిన పీడీఎస్ రైస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర రావు, గోవిందరావు, రత్తయ్య.. మొత్తం చీఫ్ సహా ఆరుగురితో సిట్‌ను ఏర్పాటు చేసింది.