సాధారణంగా శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ ధరలు తక్కువగా ఉంటుంటాయి. డిమాండ్ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ, ఈ ఏడాది శ్రావణమాసంలో చికెన్ ధరలు కొండెక్కాయి. భారీగా ధరలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కిలో చికెన్ ధర రూ.300లకు చేరింది. దీనికి కారణం లేకపోలేదు. డిమాండ్‌కు తగినంత చికెన్ సరఫరా లేకపోవడం కారణంగానే ధరలు పెరిగాయని చెబుతున్నారు. అంతేకాదు, చికెన్ దాణాకింద వినియోగించే సోయాబీన్, మొక్కజోన్న ధరలు భారీగా పెరిగాయి. సోయాబీన్ గతంలో కిలో రూ.35 ఉండగా, ఇప్పుడు ఆ ధర రూ.105కి చేరింది. మొక్కజోన్న కిలో రూ.15 నుంచి రూ.23కి పెరిగింది. దాణా ధరలు పెరగడంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కోళ్ల పెంపకం కూడా తగ్గిపోతుంది. అయితే, దాణా ధరలు పెరగడంతో ఈసారి కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు. దీని కారణంగా ధరలు భారీగా పెరినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
Read: సింహాలను మీరెప్పుడైనా ఇంత దగ్గరగా చూశారా?