Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసన సభలో పార్టీ ఎమ్మెల్యే స్వామిపై దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజుగా పేర్కొన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.. సీఎం వైఎస్ జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే నేడు దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారు.. నేటి సభలో జరిగిన ఘటనతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు అంటూ ఫైర్ అయ్యారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతాడన్న ఆయన.. స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందన్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్‌ఖు పిచ్చెక్కి ఇలా వ్యవహరించాడని.. ఇది శాసన సభ కాదు.. కౌరవ సభ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.
ఇక, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యేలు దేవాలయం లాంటి సభలో మా ఎమ్మెల్యేలపై దాడి చేశారు.. డోలా బాలవీరాంజనేయ స్వామి పై సుధాకర్ బాబు, ఎలీజాలు దాడి చేశారు.. వెల్లంపల్లి మా స్థానాల్లోకి వచ్చి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై దాడి చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. స్పీకర్ సైతం మా ఎమ్మెల్యే స్వామి పట్టుకున్న ప్లకార్డును తోసేశారు.. ధైర్యం ఉంటే అసెంబ్లీలో జరిగిన ఘటన వీడియో మొత్తాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మాపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు మాపై అసత్యాలు చెప్తున్నారన్న ఆయన.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు వీడియో ఉంటే ఎలాంటి చర్యలైనా మాపై తీసుకోండి అని సవాల్ చేశారు. కట్ అండ్ పేస్ట్ లేకుండా ఎడిట్ చేయని వీడియో ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
మరోవైపు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. కౌరవ సభకంటే దారుణంగా అసెంబ్లీ తయారైందన్నారు.. ఇద్దరు ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్య చౌదరిలపై మూకమ్ముడిగా దాడి చేశారన్న ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేలు మాదకద్రవ్యాలు సేవించి సభకు వచ్చారనే అనుమానం కలుగుతోందన్నారు.. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మినిట్ టు మినిట్ వీడియోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. కెమెరాలు ఆఫ్ చేసి దాడి చేసి ఉంటారని మా అనుమానం ఉందన్నారు ఏలూరి సాంబశివరావు. ఇక, టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. అసెంబ్లీలో మాపై దాడి జరిగితే, మమ్మల్నే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. 40ఏళ్ల నుంచి చట్టసభల్ని చూస్తున్న నేను, ఈరోజు లాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం హక్కులన్నీ సభలో హరిస్తున్నారు.. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని హెచ్చరించారు.. స్పీకర్ కి సభలో ఒక వైపే ప్రేమ ఉంటోందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటే సభలో బూతులు తిడతారా?గతంలో మా దగ్గర పనిచేసిన ఈ స్పీకర్ ఈ సీఎం దగ్గర చప్రాసిలా మారారు..! అంటూ మండిపడ్డారు బుచ్చయ్య చౌదరి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!