అనంతపురం జిల్లాలో టీడీపీ నేతపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.. పెద్దపప్పురు మండలం తిమ్మనచెర్వుకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కట్టుబడి మనోజ్ పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల డ్రైవర్ రాజు, అతని తమ్ముడు కలిసి దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో మనోజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.. అతడి శరీరంపై కత్తిగాట్లు కనిపిస్తున్నాయి..
అనంతపురం అర్బన్ మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. అనంతపురం నగరంలోని కమ్మ భవన్‌లో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మినీ మహానాడు జరిగింది. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ముందే సాకే వెంకటేష్ అనే టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగాడు. పార్టీ కోసం కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఎదుటే వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. Also Read: IPL 2025: అలాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవద్దు! ఎస్సీ సామాజిక…
పార్టీ కోసం పని చేసేవారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కందుకూరు బహిరంగ సభలో జరిగిన దురదృష్టకరమైన ఘటనపై స్పందిస్తూ.. కందుకూరు సభకు వేలాది మంది ప్రజలు వచ్చారు.. కానీ, మాజీ ముఖ్యమంత్రిగా నేను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదు.. పోలీసులు ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు.. అందుకే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు.. కందుకూరులో నేను సభ పెట్టిన…
పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో నాగులు ఇంటి సభ్యులు ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ దాడి ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని టీడీపీ కార్యకర్త ఇంటికి చేరుకోవడంతో వైసీపీ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే కక్ష్యతోనే వైసీపీకి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ మునగ రమాదేవి భర్త, కుమారులు ఈ దాడికి…
గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రౌడీల తరహాలో రెచ్చిపోయారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త సైదాను అత్యంత దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్‌ను మించిపోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువులో దారుణం జరిగింది. సైదా అనే టీడీపీ కార్యకర్తపై ప్రత్యర్ధులు దాడికి పాల్పడ్డారు. బైక్ పై వెళ్లి వస్తుండగా అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సైదాని ఆస్పత్రికి తరలించారు.