CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం
- హైదరాబాద్‌ను మించేలా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు
- విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ ప్రయాణం
- కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు
- స్మార్ట్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి రాజధాని లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా ఒక స్మార్ట్ సిటీగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని, కానీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో దానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని, వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే, గత ఐదేళ్లలో జరిగిన నష్టమే అత్యంత దారుణంగా ఉందని, దీనివల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజల మనోధైర్యం దెబ్బతిన్న అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో.. 2024 ఎన్నికల్లో ప్రజలు 94 శాతం సీట్ల విజయంతో కూటమికి చారిత్రక తీర్పునిచ్చారని గుర్తుచేశారు.
BSNL 485 Plan: మార్చి 31 వరకు BSNL ప్రత్యేక ఆఫర్.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్‌లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్‌కు.!
తెలుగుదేశం, జనసేన , బిజెపి కలిసి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయినప్పటికీ, మళ్లీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని, 2014-2019 మధ్య కాలంలో తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టిస్తున్నామని, ప్రస్తుతం ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు సంక్షేమం , అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అమరావతిని నిర్మించడం ద్వారా ఏపీ భవిష్యత్తును మారుస్తామని చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పునరుద్ఘాటించారు.
10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?