AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోల(1065, 105)పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రాజ్యాంగం నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని హైకోర్టులో న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు (ఎస్సీ+ఎస్టీ+బీసీ) 50% మించకుండా జీవోలను సవరించి అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై పలు కీలక ప్రశ్నలు గుప్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియామక ఉత్తర్వుల కాపీని తమ ముందు ఉంచాలని ఆదేశించడంతో పాటు, ఆ కమిషన్ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటని ప్రశ్నించింది. ఈ కమిషన్ ఏం అధ్యయనం చేసిందని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేయడానికి అనుసరించిన ప్రాతిపదిక, గణాంకాలు ఏంటో తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. కమిషన్ నివేదిక పూర్తి వివరాలను తాము స్వయంగా పరిశీలిస్తామని తెలిపింది. దీంతోపాటు, గతంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. అసలు ఏ ప్రయోజనం కోసం ఆ సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని తేల్చి చెప్పింది. ప్రభుత్వం సమర్పించే ఈ అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై తమ తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని వెల్లడిస్తూ ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Also Read
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!