UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI కొత్త MDR విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్..
- ఎండీఆర్ ఛార్జీలను రద్దు చేయాలని కోరిన పిటిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Charges: UPI చెల్లింపుల ఛార్జీల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రూ. 2000 దాటిన యూపీఐ మర్చంట్ లావాదేవీలపై రూ. 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 14న దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంజన్ దత్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 15 నుంచి అమలు కాబోతున్న ఎండీఆర్ ఫ్రేమ్ వర్క్‌ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
కొత్త విధానాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఎండీఆర్ అమలుకు ముందు తగిన చట్టపరమైన ప్రక్రియ, పారదర్శకత, ప్రజలతో సంప్రదింపులు జరగలేదని, ప్రభుత్వం తగిన విధానం పాటించలేదని పిటిషనర్ ఆరోపించారు. పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్-2007లోని సెక్షన్ 10ఏ కింద తీసుకున్న చర్యల చట్టబద్ధతను కూడా పిటిషనర్ ప్రశ్నించారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
అక్టోబర్ 15 నుంచి కొత్త ఎండీఆర్ విధానం..
వ్యక్తి నుంచి వ్యాపారికి (పర్సన్ టూ మర్చంట్)(P2M) లావాదేవీలపై ఎండీఆర్ అమలులోకి రాబోతోంది. రూ. 2,000 దాటిని వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తారు. సాధారణ వినియోగదారుడు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పడవని, ఇది వ్యాపారి చెల్లించే ఛార్జ్ అని కేంద్రం చెబుతోంది. వ్యక్తికి వ్యక్తి(పర్సన్ టూ పర్సన్) మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. రూ. 2000 లోపు ఉండే వ్యాపార చెల్లింపులపై కూడా ఎండీ ఆర్ ఉండదు. చిన్న వ్యాపారులు ప్రభావితంకారని కేంద్రం చెబుతోంది. నెలకు రూ. 1 లక్ష లోపు యూపీఐ ద్వారా స్వీకరించే వ్యాపారిపై కూడా ఈ ఎండీఆర్ ఛార్జీలు ఉండవని చెబుతోంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!