Andhra Pradesh: ఏపీలో అప్పుల వివరాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పులపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సమాధానం ఇచ్చింది. ఏపీలో అప్పుల భారం ఏటా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉందని.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత మూడేళ్లుగా ఏపీలో అప్పుల భారం పెరుగుతోందని వివరించింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతంగా ఉంటే… 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని కేంద్రం చెప్పింది.
Read Also: Bigg Boss 7: బాలయ్యతో ‘బిగ్‌బాస్ 7’?
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
2015లో ఏపీ జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉన్నాయని, కానీ 2021కి వచ్చేసరికి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ తన సమాధానంలో వెల్లడించింది. 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, కానీ 2020-21 నాటికి అప్పుల పెరుగుదల 17.1 శాతంగా ఉందని వివరించింది. అటు విభజన చట్టంలోని హామీల మేరకు ఇప్పటి వరకూ ఏపీకి రూ.23,110.47 కోట్లు ఆర్థిక సాయం చేశామని కేంద్రం ప్రకటించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5617.89 కోట్లు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1750 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 13,226.772 కోట్లు ఏపీకి ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!