మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ సీనియర్ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయించలేకపోయాడని విమర్శించారు.
వైయస్సార్ కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా? అని ప్రశ్నించారు. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై…
గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు.. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని.. వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు..
స్వచ్చందంగా నా అవినీతి పై, అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని కొరబోతున్నానని కడప జిల్లా ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అలాగే లోకేష్ నాయుడు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి తమ ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని అడుగుతారా? అంటూ ప్రశ్నించారు.