Byreddy Siddharth Reddy Strong Political Punches On Pawan Kalyan Over AP Volunteers Issues: వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాశంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఎన్ని పర్యటనలు చేస్తున్నా.. తనని పట్టించుకునే వారు లేకపోవడంతో, పవన్ కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్ల రూ.5 వేల గౌరవ వేతనం తీసుకుని, ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. వాలంటీర్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందనటం సరికాదని హెచ్చరించారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎవరూ ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఏపీలో కుళ్లిపోయిన పార్టీ టీడీపీ అని.. అలాంటి పార్టీతో పొత్తుకు పవన్ వెంపర్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌కు ఓటు వేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడం లేదన్నారు.
Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది
సినిమాల్లో పొలిటికల్ డైలాగులు, పాలిటిక్స్‌లో సినిమా డైలాగులు చెప్పుకుంటూ పవన్ తిరుగుతున్నారని.. అందుకే రెండూ ఎత్తిపోయాయని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందు.. లోకేష్ మంగళగిరి సంగతి చూడాలన్నారు. సీఎం జగన్ ఏపీలో పథకాలను ఎలా అమలు చేస్తున్నారో ప్రజలను అడగాలన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టైనా ప్రారంభించి, పూర్తి చేసింది లేదని తూర్పారపట్టారు. పవన్, చంద్రబాబు, లోకేష్ ముగ్గురూ మూడువైపులా తిరుగుతూ.. విష ప్రచారాలు చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిఒక్కరూ త్యాగాలు చేసే రాజకీయాలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్ గురించి విమర్శించటం మానుకోవాలని హితవు పలికారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పాలే కానీ.. మీ అంతు చూస్తామంటూ మాట్లాడటం సరికాదన్నారు.
Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి