Byreddy Siddharth Reddy: తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయలసీమలో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా లేరని వ్యాఖ్యానించారు.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి లో శాంతి నెలకొందన్న ఆయన.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో హత్యా రాజకీయాలు లేవన్నారు.. ఇక, జేసీ బ్రదర్స్‌పై విరుచుకుపడ్డ బైరెడ్డి.. జేసీ బ్రదర్స్ కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి..? అని ప్రశ్నించారు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..? అంటూ ఎద్దేవా చేశారు.. తాడిపత్రి నియోజకవర్గంలో 30 ఏళ్లుగా రాజరిక పాలన నడిపారన్న ఆయన.. ఇప్పుడు రాయలసీమలో 30 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే లేదని పేర్కొన్నారు.
Read Also: Reliance: రిలయన్స్ మరో కొత్త బిజినెస్.. పెప్సీ, కోకాకోలాకు చెక్..!
కాగా, వైఎస్ జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయి.. ఆ దృష్టితోనే నేను జగన్ కు ప్రైవేటు సైన్యం ఉందని గతంలో బైరెడ్డి పేర్కొన్న విషయం విదితమే.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ జగన్ అభిమానులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పొడిచేస్తుంది, చించేస్తుంది అంటూ తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చించుతారో, ఏం పొడుస్తారో తెలీదు కానీ… జగన్.. తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలే తలకిందులవుతాయంటూ గతంలో బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. మరోవైపు.. పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఏందిరా అంటే… రంగం అని తమిళ్ డబ్బింగ్ సినిమా ఒకటుంది. పవన్ ఆ సినిమాలో విలన్ లాంటోడు. రంగం సినిమాలో విలన్ బయటికేమో ఉద్యమం అంటాడు, పోరాటం అంటాడు… లోపలేమో ఉగ్రవాదులతో పొత్తుపెట్టుకుని ఉంటాడు అని… పవన్ కల్యాణ్ కూడా అంతే. పొద్దున లేస్తే ఉద్యమం అంటాడు, ధైర్యం అంటాడు. అన్నీ చెబుతాడు.. కానీ, చివరికి మళ్లీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాడు అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.