టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందిస్తూ.. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన ఆయన వ్యాఖ్యానించారు. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీని చెత్త నా కొడుకులే పాలిస్తున్నారంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు దెబ్బ ఖాయమని, టీడీపీ వాళ్లవి ఒక ఇల్లు కొడితే మేం పది ఇళ్లు కొడతామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ప్యాలెసును కూలగొట్టడం ఖాయమంటూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలు ఏపీ వదిలి పారిపోయేలా చేస్తామని, చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు బీసీలు బ్రహ్మరధం పట్టారని.. బీసీ నేత అయ్యన్నను టార్గెట్ చేశారన్నారు. జగన్ టార్గెట్ చేస్తోంది అయ్యన్నను కాదు బీసీలనేనని, బీసీలంటే అంత చులకనా..?అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబును ముసలి నక్కా అంటూ విజయసాయి రెడ్డి అనే కుక్క మాట్లాడుతోందని, విజయసాయిని కుక్క అంటే కుక్క కూడా సిగ్గు పడుతుందంటూ ఆయన ధ్వజమెత్తారు. అయ్యన్నతో సహా బీసీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం.. జగన్ తప్పిదాలను ఎండగడతామని ఆయన వెల్లడించారు.