A Girl Left House After Writing Suicide Letter In Nirmal Dist: ‘‘శతృవులు ఎక్కడో ఉండరురా, మన చుట్టుపక్కలే ఉంటారు’’ అని ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు.. మంచివాళ్లుగా నటిస్తూ మన చుట్టూ తిరిగే వ్యక్తులే మన చెడుని కోరుకుంటుంటారు. అందరూ కాకపోయినా.. కొందరు మాత్రం మన ఎదుగుదలని చూసి ఓర్వలేరు. ఎలాగోలా దెబ్బ కొట్టాలని వ్యూహాలు రచిస్తూనే ఉంటారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ తాజా ఉదంతం. పాపం ఆ యువతి.. పెళ్లి చేసుకొని, హ్యాపీగా దాంపత్య జీవితాన్ని గడుపుదామని కలలుకంది. కానీ, తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులే ఆమె కలల్ని నాశనం చేశారు. ఆమె పెళ్లిని చెడగొట్టారు. దీంతో మనస్తాపం చెందిన ఆ అమ్మాయి.. సూసైడ్ నోట్ రాసి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Sania Mirza: సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్.. చివరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన స్టార్స్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి.. ఒక కంప్యూటర్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆ కంప్యూటర్ సెంటర్ పక్కనే ఉన్న ఫోటోషాప్ యజమాని వంశీ, అతని భార్యతో ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. దాంతో వాళ్లు స్నేహితులుగా మారారు. తనకు సంబంధించిన విషయాలన్నింటినీ ఆ యువతి వారితో పంచుకుంది. కట్ చేస్తే.. ఫిబ్రవరిలో ఆ యువతికి ఒక వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం తేదీని కూడా ఖరారు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. అబ్బాయి తరఫు వారు పెళ్లిని క్యాన్సిల్ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువతి.. ఒక సూసైడ్ నోట్ రాసి, ఇంటి నుంచి వెళ్లిపోయింది. తనకు పెళ్లి కుదిరిన అబ్బాయికి వంశీ దంపతులు ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పారని.. వాళ్లే తన పెళ్లిని చెడగొట్టారని అందులో పేర్కొంది. తాను ఇళ్లు వదిలి వెళ్లిపోవడానికి వంశీ దంపతులే కారణమని తెలిపింది.
Water Pipeline Bursts: నీటి ఒత్తిడికి బద్దలైన పైప్‌లైన్.. ముక్కలైన రోడ్డు
ఈ సూసైడ్ నోట్ తీసుకొని.. కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. వంశీ దంపతుల కారణంగా తన అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోయిందని, దాంతో మనోవేదనకు లోనై ఇల్లు వదిలి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశారు. వంశీ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీరుమున్నీరు అయ్యారు. వారి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు.. వంశీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే.. ఆ యువతి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లిందని గాలింపు చర్యలు చేపట్టారు.