China: చైనాలో ఇంతే.. ఆర్మీపై జోక్ చేసినందుకు భారీ జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో మానవహక్కులకు పెద్దగా విలువ ఉండదు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కానీ, ఆ దేశ నేతలను కానీ విమర్శిస్తే.. విమర్శించిన వారు తెల్లారేసరికే మాయం అవుతారు. వారి ఆచూకీ దశాబ్ధాలు గడిచిన కనిపించదు. అంతగా నిర్భందం ఉంటుంది అక్కడ. ఇక చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ గురించి చెప్పే పని లేదు. సరిహద్దు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంటుంది. అయితే చైనా ఆర్మీని మాత్రం విమర్శిస్తే అక్కడి పాలకులు ఊరుకోరు.
ఇదిలా ఉంటే చైనా ఆర్మీపై కామెడీ చేనందుకు ఓ కంపెనీ భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. జోక్ వేసినందుకు చైనీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టాండ్ అప్ కామెడీ షో సందర్భంగా దాంట్లో ఒకరు చైనా ఆర్మీపై జోక్ వేశాడు. దీంతో అధికారులు సదరు జోక్స్ కంపెనీ ‘షావ్ గ్వోవ్ కల్చర్ మీడియా’కి 14.7 మిలియన్ యువాన్లు (2.13 మిలియన్ డాలర్ల) జరిమానా విధించబడింది. ఇండియన్ కరెన్సీలో 17.5 కోట్ల రూపాయలు. దీంతో పాటు చైనా రాజధాని బీజింగ్ తో పాటు మరో నగరం షాంఘైలో దీని ప్రదర్శనలను నిరవధికంగా నిలిపివేశారు.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
Read Also: Kim Jong Un: కిమ్ కూతురు ఎలా ఉందో చూడండి.. శాటిలైట్ పరిశీలనకు వచ్చిన తండ్రీకూతుళ్లు
ప్రదర్శన ఇస్తున్న లి హవోషి, చైనా సైన్య నినాదాన్ని అవమానించాడని, ఇది చట్టాన్ని ఉల్లంఘించిందని చైనీస్ అధికారులు పేర్కొన్నారు. ప్రదర్శన సమయంలో లీ తన పెంపుడు కుక్క.. ఉడతను తరమడాన్ని ఉద్దేశిస్తూ, ఆర్మీ నినాదమైన ‘‘గుడ్ స్టైల్ ఆఫ్ వర్క్.. కాపబుల్ ఆప్ విన్నింగ్ బాటిల్’’ను రిఫర్ చేశారు. దీంతో అక్కడి అధికారులు ఆర్మీని అవమానపరిచినట్లుగా భావించారు.
చైనాలో అధికారులు ఆన్లైన్ సెన్సార్ షిప్ ను కఠినతరం చేశారు. తాజాగా ఈ జరిమానా గురించి మాట్లాడుతున్న అక్కడి అధికారులు.. ‘‘జాతీయ భావాలను దెబ్బతీయకూడదు’’ అని చెబుతున్నారు. ఈ జోక్ ఈ నియమాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. చైనా ఆర్మీ జాతీయ భద్రతకు, ప్రజల శాంతికి సంరక్షుడిగా అక్కడి మున్సిపల్ కల్చర్ అండ్ టూరిజం బ్యూరో చెప్పింది. చైనీస్ సోషల్ మీడియా ‘వియ్ బో’లో దీన్ని ఎక్కువ ప్రజలు సెర్చ్ చేశారు. 700 మిలియన్లకు పైగా హిట్స్ వచ్చాయి.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?