Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
- తిరుపతి సభపై బొత్స ఫైర్
- కూటమికి 'సున్నా' మార్కులు
- రైతులు, విద్యపై విమర్శలు
- స్టీల్ ప్లాంట్, కరెంట్‌పై ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో కూటమి నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అది విజయ సభ కాదు, ప్రజలకు చేస్తున్న ‘వెన్నుపోటు సభ’ అని అభివర్ణించారు. ఆ సభలో కేవలం మైకుల సౌండ్ తప్ప జనం నుంచి ఎలాంటి రీసౌండ్, రియాక్షన్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్న ‘సూపర్ సిక్స్’ పథకాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయని, ఆడబిడ్డ నిధి వంటి పథకాలకు మంగళం పాడేందుకే ఈ సభ నిర్వహించారని మండిపడ్డారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కూటమి పార్టీలు, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క మహిళకు కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు బేల మాటలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందనే నಮ್ಮకం తనకు లేదని, రెండేళ్ల కూటమి పాలనకు తాము ‘సున్నా’ మార్కులు వేస్తున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతాంగం, విద్యారంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతు పండించే ఏ పంటకూ సరైన ధర లేదని, కానీ మార్కెట్లో తినే వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని, మధ్యలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న దళారులు మాత్రమే బాగుపడుతున్నారని ఆరోపించారు. ఎరువుల పంపిణీని యాప్ ఆధారితం చేసి చేతులెత్తేయడంతో రైతులు పక్క రాష్ట్రాల నుండి బ్లాక్‌లో కొనుగోలు చేసుకుంటున్నారని, ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇక విద్యాశాఖను ఛాలెంజ్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, వ్యవస్థను బాగు చేయడానికి కాకుండా పూర్తిగా చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వసతులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సీతాకోకచిలుకల్లా ఉండేవారని, ఇప్పుడు ఆ సౌకర్యాలన్నీ ఏమయ్యాయని నిలదీస్తూ, లోకేష్ డిక్షనరీలో డీఎస్సీ (DSC) కి అసలు అర్థం ఏంటో ఆయనే చెప్పాలన్నారు.
Also Read
- MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
రాష్ట్రంలో సమస్యలను పక్కనపెట్టి ఎకరం రూపాయి చొప్పున భూములను కట్టబెట్టి కిక్బ్యాక్స్ తీసుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గూగుల్ డేటా సెంటర్ బండారం కూడా రెండు రోజుల్లో బయటపడుతుందని బొత్స హెచ్చరించారు. అప్పులు చేయడంలో తప్ప ఈ ప్రభుత్వం దేంట్లోనూ గ్రేట్ కాదని, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఐదు పైసలైనా కరెంట్ ఛార్జీలు తగ్గించామని ఏ ఇంటికైనా వెళ్లి నిరూపించగలరా అని సవాల్ విసిరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను కాపాడాల్సింది పోయి వాటిని అమ్ముకోమని చెప్పడం దారుణమన్నారు. బీచ్‌లలో బార్లను ఓపెన్ చేస్తూ సంస్కృతిని పాడుచేస్తుంటే మిక్స్డ్ కಲ್చర్ ఉన్న జనసేన అంగీకరించవచ్చు కానీ, ఒకే కల్చర్ అని చెప్పుకునే బీజేపీ ఎలా ఒప్పుకుందో చెప్పాలన్నారు. చంద్రబాబు వెనుక కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు తానా అంటే తానా అంటున్నాయని, ఇప్పటికైనా ప్రజలను వెన్నుపోటు పొడవడం ఆపి, సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 క్లర్క్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, పూర్తి వివరాలు
-
Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
-
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
-
Jemimah: “సైనికుల త్యాగాలను మరిచావా?”.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమాను కౌగిలించుకున్న జెమిమా.. ట్రోల్స్ వర్షం!
-
Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. ‘బట్వారా 1947’ క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!