Bonda Uma: ఏపీలో ఉన్న బీసీ నేతలు జగన్‌కు పనికిరారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో అత్యంత అవినీతి సీఎం జగన్ అని.. ఏపీలో కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పథకం ప్రకారం జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. కల్పవృక్షం లాంటి అమరావతిని నీరుగార్చారని.. ఒక సామాజిక వర్గానికి అమరావతిని అంటగట్టడం దారుణమైన విషయమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం అమరావతే రాజధాని అని కోర్టులు స్పష్టం చేసినా వైసీపీ నేతలు రాజకీయం కోసమే రాజధాని అంశాన్ని వాడుకుంటున్నారన్నారు.
Viral: ఆ మాత్రం నీటిలో నడవలేరా? బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శల వర్షం
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
టీడీపీ హయాంలో దూరదృష్టితో ఆలోచించి ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని భావించామని.. కానీ లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు ఎక్కడ జరిగాయో చూపించాలని వైసీపీ నేతలను బోండా ఉమా ప్రశ్నించారు. న్యాయబద్ధంగా ఏర్పడిన అమరావతిని జగన్ ఏమీ చేయలేరని.. టీడీపీ నాయకులను ఏమీ పీకలేరని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై పెట్టిన అవినీతి కేసుల్లో ఒక్కటైనా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. న్యాయ స్థానాలలో అనేక చీవాట్లు తిన్న దేశంలోని ఏకైక సీఎం జగన్ మాత్రమే అని విమర్శించారు. ఆయన వల్ల అనేక మంది అధికారులకు శిక్షలు పడుతున్నాయని బోండా ఉమ ఆరోపించారు. ఏపీని ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాకు కేంద్రంగా తయారుచేశారని.. పదో తరగతి పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేని సీఎం జగన్ అని బోండా ఉమా అన్నారు. రాబోయే రోజుల్లో దొంగల పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గడప గడపకు ఆ పార్టీ నేతలు వెళ్తుంటే ప్రజలు ఛీ కొడుతున్నారని.. 8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం చిక్కుకుపోయిందని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఉందన్నారు. ఏపీలోని ఉన్న బీసీ నాయకులు జగన్‌కు పనికిరాకుండా పోయారా అని బోండా ఉమా నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!