AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP SIR Voter List Revision: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) అభ్యర్థన మేరకు ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను సవరించి గడువును పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 10వ తేదీ వరకు దాఖలు చేసుకోవచ్చు. ఓటర్ల నుంచి అందే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించేందుకు అక్టోబర్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
అనంతరం అన్ని ప్రక్రియలను పూర్తి చేసి అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఓటర్లకు తమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే గడువులోగా తెలియజేసే అవకాశం మరింత పెరిగింది. సవరించిన ఎస్ఐఆర్ షెడ్యూల్‌ను వెంటనే రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే షెడ్యూల్లో చేసిన మార్పులపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సూచించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలను సరిచేసేందుకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల ప్రక్రియ కీలకంగా ఉంటుంది. గడువు పొడిగింపుతో ఓటర్లకు తమ వివరాలను పరిశీలించుకునేందుకు అదనపు సమయం లభించనుంది.
Also Read
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
NZ Vs IND: మరో సమరానికి సిద్ధంగా టీమిండియా.. రేపే మొదటి వన్డే..
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!