Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ స్పెషల్ ఫోకస్..
- కీలక పదవులపై ముందే ఫోకస్ పెట్టమని జగన్ ఆదేశాలు..
- అవసరాన్నిబట్టి కుటుంబ సభ్యులను దింపమని సూచన..
- ఎన్నికలు అయ్యాక ప్రతి నియోజకవర్గం నుంచి రిపోర్ట్..
- ఇన్ఛార్జ్లు ఎలా సమన్వయం చేశారో పూర్తి స్థాయి పోస్ట్‌మార్టం..
- 40 నుంచి 45 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరగడంలేదని నివేదిక..
- పని చేయని ఇన్ఛార్జ్లకు స్థానిక ఎన్నికలే ఫైనల్ ఛాన్స్?..
- ఇప్పుడు కింది స్థాయిలో గెలిపిస్తే రేపు వాళ్ళే ఉపయోగపడతారన్న లెక్క..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ అధిష్ఠానం ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ స్థాయి నుంచి ప్రతి దశలోనూ గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థులను సిద్ధం చేయాలని నాయకుల్ని ఆదేశించారు పార్టీ అధ్యక్షుడు జగన్. ప్రతి గ్రామంలో పార్టీ తరపున అభ్యర్థి ఉండాలని, ప్రతి వార్డులో పోటీ జరగాలని వార్నింగ్ బెల్స్ మోగించటంపై ఇప్పుడు ఇంటర్నల్‌గా గట్టి చర్చలే జరుగుతున్నాయట. కేవలం అభ్యర్థులను నిలబెట్టడంతోమే సరిపెట్టకుండా….కీలక పదవులపై కూడా ముందుగానే ఫోకస్ పెట్టాలని.. బలమైన అభ్యర్థులను ముందుగానే గుర్తించి స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలు.. స్థానిక విభేదాలు.. నాయకుల మధ్య ఈగోలు ఎన్నికల సమయంలో పార్టీకి ఇబ్బంది కలిగించకుండా చూడాలని, వ్యక్తుల కంటే పార్టీ గెలుపే ముఖ్యం అని చెప్పడంతో పాటు అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా ఎన్నికల బరిలోకి దింపి పార్టీ బలాన్ని పెంచాలని సూచించారట. ఆ రకంగా.. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చినా.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని నేతలకు సూచించటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపై జగన్ ఫోకస్ చేయటం గురించి ఇప్పుడు పార్టీలో స్థానిక ఎన్నికల కంటే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఎన్నికల తర్వాత ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుంటానన్న జగన్.. ఎక్కడ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు.. ఎక్కడ పోటీకి దూరంగా ఉన్నారు.. అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది.. వారి గెలుపు కోసం నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఎంతవరకు పనిచేశారు.. క్యాడర్‌ను ఏ మేరకు సమన్వయం చేశారు.. లాంటి చాలా అంశాలను పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల విషయంలోనూ ఇలాంటి సమీక్షే జరిగినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మెడికల్ కాలేజీల పీపీపీ నుంచి డీఎస్సీ వరకు పార్టీ వరుస ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది ప్రతిపక్షం. ముఖ్యంగా డీఎస్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించినా.. 40 నుంచి 45 నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు జరగలేదన్న ఇంటర్నల్ రిపోర్ట్స్ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపిస్తే.. పార్టీకి ఇబ్బందులు తప్పవన్న భావనలో ఉందట అధిష్ఠానం. దీంతో స్థానిక ఎన్నికలు ఇన్‌ఛార్జ్‌ల పనితీరుకు ఒక రకంగా రిపోర్ట్ కార్డ్ అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.
Also Read
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా లేరని భావిస్తున్న కొందరు నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు.. స్థానిక ఎన్నికలు
ఫైనల్ ఛాన్స్ కావొచ్చన్న అంచనాలున్నాయి. వాళ్ళ పనితీరును నిశితంగా పరిశీలించి.. ఆ తర్వాత భవిష్యత్ రాజకీయ బాధ్యతలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మార్పు అవసరమని భావించే చోట ప్రస్తుత ఇంఛార్జ్‌ల పనితీరు ఎలా ఉంది.. పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతారన్న అంశాలను బేరీజు వేసుకుని భవిష్యత్ నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి చెందిన స్థానిక నాయకులను గెలిపించగలిగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే కేడర్ పార్టీకి బలంగా నిలుస్తుందన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే ఈసారి స్థానిక సమరాన్ని కేవలం ఎన్నికగానే కాకుండా నియోజకవర్గాల ఇంచార్జ్ లకు రిపోర్ట్ కార్డ్‌లాగా చూస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట. గ్రామంలో గెలుపు నుంచి నియోజకవర్గంలో నాయకత్వం వరకు స్థానిక ఎన్నికల ఫలితాలతో వైసీపీలో కొత్త లెక్కలు మొదలయ్యే అవకాశం ఉందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!