తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక నారాయణ, చైతన్య విద్యాసంస్థల ప్రమేయం ఉందంటూ ఇటీవల ఏపీ సీఎం జగన్ బహిరంగంగానే వ్యాఖ్యానించిన నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌కు వచ్చి నారాయణను చిత్తూరు పోలీసులు తీసుకెళ్లారు. మాజీ మంత్రి నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి ఉన్నారు. మరోవైపు టెంత్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదు, కుట్ర పన్ని…
ఏపీలో విద్యావ్యవస్థలో లోపాలపై బీజేపీ, బీజేపీ యువమోర్చా ఆందోళన వ్యక్తం చేశాయి. పదవ తరగతి పరీక్ష ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మైలు రాయి. ఏ పని చేయాలన్నా , ఏ ఉద్యోగం చేయాలన్నా మెరిట్ చూస్తారు. అంతటి ప్రాధాన్యత ఉంది పదవ తరగతికి. పదవ తరగతి పరీక్షల్లో మొదటగా తెలుగు పేపర్ లీక్ అయింది. పోనీ తర్వాత జరిగే పరీక్షలు అయినా లీక అవకుండా చూడాలి. ప్రతి పేపర్ లీక్ అయ్యింది. విద్యాశాఖలో ఇంతటీ ఘోరం…
ఏపీలో SSC పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని SSC ఎగ్జామినేషన్ డైరెక్టర్ దేవానంద రెడ్డి ఎన్టీవీతో చెప్పారు. ఇప్పటి వరకు పేపర్ లీక్ కాలేదన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక క్యశ్చన్ పేపర్ షేర్ అయింది. ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్‌ఛార్జ్ లే దీనికి సహకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఏపీ వ్యాప్తంగా మాస్ కాపీయింగ్ కి సహకరిస్తున్న 55 మందిని అరెస్ట్ చేసాం అన్నారు దేవానంద్ రెడ్డి. అందులో 35 మంది ప్రభుత్వ…