ప్రధాన నరేంద్ర మోడీని కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని ఆహ్వానించారు.. ఈరోజు ఆయన కార్యాలయంలో ప్రధాని మోడీని కలిశారు రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు… అనేక ప్రతిష్టాత్మకమైన జాతీయ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్బంగా ప్రధానికి జీవీఎల్ స్వయంగా అందచేసిన లేఖలో విశాఖపట్నంలో పూర్తికానున్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రస్తావించారు.. వాటిపై ప్రధాని మోడీకి వివరించారు.
Read Also: Kuppam: కుప్పం టీడీపీ నేతలకు షాక్.. హత్యాయత్నం కేసులు నమోదు
విశాఖపట్నంలో రూ.26,000 కోట్తో హెచ్‌పీసీఎల్ పెట్రోలియం రిఫైనరీ విస్తరణ మరియు ఆధునికీకరణ ప్రాజెక్ట్ మరియు ఐఐఎం విశాఖపట్నం యొక్క ఆధునిక, హరిత క్యాంపస్ మొదటి దశ, విశాఖపట్నంలో క్రూయిజ్ టెర్మినల్ మొదలైనవి వాటిలో ఉన్నాయి. విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంతో మంజూరైన సౌత్ కోస్ట్ రైల్ జోన్ యొక్క కొత్త కార్యాలయ సముదాయంతో సహా విశాఖపట్నంలో మంజూరైన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించారు.. సుమారు రూ.400 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్ట్, రూ.385 కోట్ల వ్యయంతో 400 పడకల స్పెషాలిటీ ఈఎస్‌ఐ హాస్పిటల్, విశాఖపట్నంలో ఆధునిక మెగా ఫిషింగ్ హార్బర్ మొదలైనవి కూడా ఈ లేఖ ప్రస్తావించారు జీవీఎల్.
అంతేకాకుండా, విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ మరియు ఇతర రక్షణ సంస్థలలో అనేక ప్రాజెక్టులు, అభివృద్ధిని కూడా ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా చేర్చవచ్చని లేఖలో పేర్కొన్నారు ఎంపీ జీవీఎల్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. విశాఖపట్నం పర్యటన కేంద్ర ప్రభుత్వ ప్రధాన అభివృద్ధి పథకాలపై విశాఖ మరియు రాష్ట్ర ప్రజల దృష్టి సారింప చేయడమే కాక.. ఈ ప్రాజెక్టులు కేవలం కేంద్ర ప్రభుత్వ చొరవతో మాత్రమే అని ప్రజలు అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుందని జీవీఎల్ ప్రధానికి తెలియచేశారు.. ఇక, ఈ లేఖ పై ప్రధాని స్పందిస్తూ వీలైనంత త్వరగా విశాఖ పర్యటనకు రావడానికి ప్రయత్నం చేస్తాననీ జీవీఎల్ కు తెలియజేశారట.. దీంతో, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియచేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు..