సీఎం పేరు చెప్పుకొని ఎమ్మెల్యే రౌడీయిజం.. అఖిలప్రియ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆళ్లగడ్డలో ఇష్టం వచ్చినట్టుగా పన్నుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. అకౌంట్లలో నగదు వేస్తే ప్రజలు నోరు మూసుకుని ఉంటారని ప్రభుత్వం నీచమైన ఆలోచన చేస్తోందంటూ ఆరోపించారు.. ప్రభుత్వం మున్సిపాలిటీలను అ భివృద్ధి చేయకుండా పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతోందని, ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని షాపులకు ప్రభుత్వం మూడేళ్లకు 33 శాతం రేట్లు పెంచి జీవో జారీ చేసిందని.. కానీ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రభుత్వ జీవోను పక్కన పెట్టి ఏడాదికి 65 శాతం పెంచి కొత్త జీవోను జారీ చేశారని దుయ్యబట్టారు.. కొత్త జీవోలో వృత్తి, వ్యక్తులను బట్టి రేట్లు పెంచడం దుర్మార్గమైన విషయమన్న ఆమె.. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇక, ఆళ్లగడ్డలోని రూ. 3 కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి కట్టలేక.. ఎమ్మెల్యే రేట్లు పెంచడం అన్యాయమన్న ఆమె.. సీఎం వైఎస్ జగన్ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు భూమా అఖిల ప్రియ.
Also Read
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!