OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
- శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
- చంద్రబాబును కలిసి వచ్చాక యాక్టివ్ అయిన మాజీ ఎమ్మెల్యే
- మా నేతకు హామీ వచ్చిందని గుండ అనుచరుల హడావిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం టీడీపీలో ఈక్వేషన్స్ మారుతున్నాయా? మున్సిపల్ ఎన్నికల్లో కొత్త లెక్కలు తెర మీదికి రాబోతున్నాయా? మేయర్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఒకరు గట్టిగా పట్టుబడుతున్నారా? ఆమెకు దక్కకుండా… సిట్టింగ్ శాసనసభ్యుడు పావులు కదుపుతున్నారా? ఇద్దరిలో ఒక వర్గాన్ని కాదని మరో వర్గానికి సీటిస్తే కలిసి పని చేసే అవకాశం ఉందా? అసలేంటా వివాదం? పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరుస్తుందేమోనన్న మాటలు టీడీపీ కేడర్ నుంచే ఎందుకు వినిపిస్తున్నాయి?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా… ఈసారి మున్సిపల్ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతుండటంతో… అధికార కూటమి నుంచి సీనియర్ లీడర్స్ ఎవరికి వారు సీరియస్ ట్రయల్స్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే… ఇప్పుడు శ్రీకాకుళం నగర మేయర్ పీఠం ఆసక్తికరంగా మారింది. ఈ సీటు కోసం టీడీపీ సీనియర్స్ ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగమేనా అన్నట్టు తాజాగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేరు తెర మీదకు వచ్చింది. ఆ మధ్య పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన తర్వాత మరింత యాక్టివ్ అయ్యారట మాజీ ఎమ్మెల్యే. దీంతో… తమ నాయకురాలికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ కాస్త హడావిడి మొదలు పెట్టారు లక్ష్మీదేవి అనుచరులు. అలాగే… ఆమె కూడా… నగరంలోని ప్రతి వార్డ్‌ను టచ్ చేస్తూ…. కేడర్‌తో మమేకం అవుతున్నారట. దివంగత నేత గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాల ఏర్పాటు విషయమై చెలరేగిన వివాదం సద్దుమణుగుతున్న సందర్భంలో వచ్చిన మేయర్ ఎన్నికలు శ్రీకాకుళం రాజకీయాల్లో మరోసారి కాక రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాల సంగతి అలా ఉంటే….ఆమెకు సిట్టింగ్ శాసనసభ్యుడు గోండు శంకర్ వర్గం సహకరిస్తుందా అన్నది ఇప్పుడు సిక్కోలు పాలిటిక్స్‌లో హాట్ టాక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం సీటు రెండు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా పోటీ నడిచింది. ఫైనల్‌గా శంకర్ దక్కించుకుని శాసనసభ్యుడు అయ్యారు. ఈ పరిస్థితుల్లో…ఇప్పుడు గండ లక్ష్మీదేవి మేయర్ సీటు దక్కించుకుని గెలిచి పీఠం మీద కూర్చుంటే…. మరో పవర్ సెంటర్ అవుతారన్న అభిప్రాయం ఎమ్మెల్యే శంకర్ వర్గంలో ఉందట. అందుకే… ఎక్కడో తేడా కొడుతోందన్నది శ్రీకాకుళం టీడీపీ ఇన్నర్ సర్కిల్స్ టాక్. ఇటు గోండు శంకర్ వర్గంలోని పలువురు నేతలు కూడా టిక్కెట్ ట్రయల్స్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్మీదేవికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేనే వాళ్ళని వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారా అన్న అనుమానాలు సైతం చాలా మందికి ఉన్నాయట. కొర్ను ప్రతాప్‌తో పాటు మరికొందరు నేతలు మమ్మల్ని కూడా పరిగణనలోకి తీసుకోమని టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారుతోంది. దీంతో… ఫైనల్‌గా ఎమ్మెల్యే శంకర్ ఎవరికి మద్దతుగా నిలబడతారు? పార్టీ అధిష్టానం మనసులో ఏముందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
చివరికి పార్టీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా… మాజీ, తాజా ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలను పక్కనపెట్టి రెండు వర్గాలు కలిసి పని చేస్తే…ఇక్కడ గెలుపు సాధ్యం కాదు.. అటు ప్రతిపక్షం వైసీపీకి కేడర్ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో…. టీడీపీలోని రెండు వర్గాలు కలిసి పని చేయకుండా ఒకరికి టిక్కెట్ ఇచ్చారని మరో వర్గం గోతులు తీస్తే మాత్రం… పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిన సామెతే అవుతుందని అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!