Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
- బడ్జెట్లో భారీ బ్యాటరీ ఫోన్
- Realme P4s Lite 4G లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme P4s Lite 4G India Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Realme కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Realme P4s Lite 4G వేరియంట్‌ను భారత మార్కెట్లో సైలెంట్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్లో 7,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 13MP కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌లో 5G వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Realme P4s Lite స్పెసిఫికేషన్లు
Realme P4s Liteలో 6.75 అంగుళాల LCD డిస్ప్లే అందించారు. ఈ HD+ స్క్రీన్ 1570 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్ప్లే గరిష్ఠంగా 900 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. అలాగే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. Vivid మోడ్‌లో కలర్ గ్యామట్ 86% DCI-P3గా ఉంది. స్క్రీన్కు రక్షణ కోసం Panda MN228 ప్రొటెక్టివ్ గ్లాస్ ఉపయోగించారు.
Also Read
- 8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
- New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
- 2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
- Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
Unisoc ప్రాసెసర్.. 128GB వరకు స్టోరేజ్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో Unisoc T7250 ప్రాసెసర్ ను అందించారు. దీనికి 4GB LPDDR4X RAM జత చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే 64GB, 128GB ఆప్షన్లు ఉన్నాయి. అదనంగా స్టోరేజ్‌ను పెంచుకునేందుకు microSD కార్డ్ స్లాట్ కూడా అందించారు. ఈ ఫోన్ Realme UI ఆధారిత ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది.
7,000mAh భారీ బ్యాటరీ
Realme P4s Liteలో ప్రధాన ఆకర్షణ 7,000mAh బ్యాటరీ. ఈ బ్యాటరీకు 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 15W USB Power Delivery రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. ఫోన్ బరువు సుమారు 215 గ్రాములు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో 13MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5MP కెమెరా అందించారు. వెనుక కెమెరాతో 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్లు
Realme P4s Liteలో Wi-Fi 5, Bluetooth 5.2, GPS, USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. అయితే ఇది 4G మోడల్ కావడంతో 5G సపోర్ట్ లేదు. అలాగే NFC కూడా అందుబాటులో లేదు. ఈ ఫోన్ అక్టోబర్ 8 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది. Nebula Black, Moonlight Silver రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
Realme P4s Lite ధర ఎంత?
4GB + 64GB రూ.16,499
4GB + 128GB రూ.18,499
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!