KIMS Hospital: సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు అవస్థలు పడ్డారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఆస్పత్రి సిబ్బంది ఐసీయూలో ఉన్న రోగులను మరో వార్డుకు తరలించారు. వెంటనే సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్షణంలో మంటలు ఐసీయూలో వ్యాపించడంతో అక్కడున్న వారందరూ తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. అయితే ఈ ప్రమాదం నిన్న (బుధవారం) జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఆసుపత్రి యంత్రాంగం గోప్యంగా ఉంచింది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎటువంటి హానీ జరగలేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు.
Read also: Counting Centers: నిఘా నీడలో కౌంటింగ్ కేంద్రాలు.. ఏర్పాట్లు చేసిన అధికారులు
తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఎంఎస్‌ఎన్ రెండో యూనిట్‌లో రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. రసాయన డ్రమ్ములు MSN ఇండస్ట్రీస్ నిల్వ విభాగంలో నిల్వ ఉండటంతో భారీ పేలుడు జరిగింది. రసాయనాలు ఉంచిన డ్రమ్ములు పేలడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. విపరీతంగా మంటలు వ్యాపించడంతో పాటు అందులో ఉండే రసాయనాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు వ్యాపించాయి. కెమికల్ డ్రమ్ములు పేలడంతో మంటలను అదుపు చేసేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
Counting Centers: నిఘా నీడలో కౌంటింగ్ కేంద్రాలు.. ఏర్పాట్లు చేసిన అధికారులు