ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇచ్చిన హామీలను నేరవేర్చమంటే అరెస్టులతో వేధిస్తున్నారా.?తాడేపల్లి ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో ఎన్నికల్లో గెలవడానికి కన్నూమిన్నూ కానకుండా హామీలిచ్చారు. ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో వారంలో రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి. జగన్ చేసిన…