ఏపీలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయ్యన్నపాత్రుడు మొదటిసారి మంత్రి అయ్యేటప్పటికి జగన్ పాలుతాగుతున్నాడు.అయ్యన్నపాత్రుడు ని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి పోలీసులను పంపిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ పోలీసులు మోహరింపు, నిర్బంధం చూస్తే నర్సీపట్నంలో ఉన్నామా ఉక్రెయిన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు లోకేష్. అయ్యన్నపాత్రుడు పై 9 కేసులు పెట్టారు….అందులో నిర్భయ చట్టం కింద ఉండటం దారుణం. ఇప్పటి వరకు…
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పోలీసుల…
బద్వేల్ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాన్ని మార్చివేయనుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం ఏపీలో ఎవరు మిత్రులు.. ఎవరు శత్రువులు అనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వనుంది. బద్వేల్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రోజురోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంది. ఒక పార్టీలో బరిలో ఉంటామని ప్రకటిస్తుండగా మరోపార్టీ పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెబుతోంది. దీంతో బద్వేల్ రాజకీయం ఒకింత…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే క్రమంలో.. ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నారా? సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు.. ఆయన వ్యవహారశైలి అవుననే సమాధానం చెబుతోంది. సందర్భానుసారం మాట్లాడ్డం.. ముఖ్యమైన విషయాలపై ట్వీట్లు చేయడం తప్ప.. పెద్దగా హడావుడి చేయకుండా.. ఆయన ఎదురుచూస్తున్న తీరు సైతం.. సరికొత్త వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. చంద్రబాబు…
ఏపీ గవర్నరును కలిశారు టీడీపీ నేతలు. జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందనుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చింది. రాత్రి పూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా లేదా అనేది ఒక వారం రోజులు…