Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన మొదటి విడత పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికార వ్యవస్థలను, పోలీసు యంత్రాంగాన్ని, చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) కూడా దుర్వినియోగం చేస్తూ ఎన్నికలను 100 శాతం అక్రమంగా నిర్వహించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలను భయాందోళనలకు గురిచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేశారని మండిపడ్డారు.
1500 మందికి పైగా నామినేషన్లు వేయలేని పరిస్థితి
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించిందని సజ్జల ఆరోపించారు. అభ్యర్థులు ఉన్నప్పటికీ వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలను చించేయడం, అడ్డంకులు సృష్టించడం చేశారని తెలిపారు. పోలీసుల సహకారంతో టీడీపీ శ్రేణులు అక్రమాలకు పాల్పడ్డాయని, చివరికి స్క్రూటినీలోనూ దరఖాస్తులను అన్యాయంగా తిరస్కరించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అటెంప్ట్ మర్డర్ కేసులు, బైండోవర్లు, గంజాయి కేసులు బనాయించడంతో పాటు కిడ్నాప్‌లకు కూడా తెగబడ్డారని, దీంతో దాదాపు 1500 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని వివరించారు.
Also Read
సుప్రీంకోర్టు ఉత్తర్వులు పక్కనబెట్టి దొంగ ఓట్లు, రిగ్గింగ్
నామినేషన్ల సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు అమలు చేయలేదని సజ్జల మండిపడ్డారు. పారిపోకుండా, పిరికిపందలా బహిష్కరించకుండా తట్టుకుని నిలబడి పోరాడిన తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ రోజు కేంద్రాల్లోకి రానివ్వలేదని ధ్వజమెత్తారు. కడపలో 361 పోలింగ్ బూతులకు గాను 360 బూతుల్లో తమ ఏజెంట్లను పోలీసులు ముందే అడ్డుకున్నారని ఆరోపించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బహిరంగంగా దొంగ ఓట్లు వేయించారని, విచ్చలవిడిగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలేకరులు, ఏజెంట్లపై దాడులు.. సజ్జల రీపోలింగ్ డిమాండ్
కవరేజ్ కోసం వెళ్లిన ఎన్టీవీ, ఇండియా టుడే జర్నలిస్టులతో పాటు తమ పార్టీ ఏజెంట్లపై పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా దాడులు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పులివెందులతో పాటు పలు నియోజకవర్గాల్లో వ్యవస్థలన్నింటినీ రంగంలోకి దించి అరాచకాలను నడిపారని విమర్శించారు. ఇప్పటివరకు అక్రమాలపై 100కు పైగా ఫిర్యాదులు చేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాదరణ లేక కృత్రిమంగా విజయం సాధించేందుకే చంద్రబాబు నాయుడు ఈ విధమైన నాటకాలు ఆడారని మండిపడ్డారు. అనేక జిల్లాల్లో వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని సజ్జల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!