మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. రానున్న మార్చి నాటికి మునిసిపాలిటీల పదవీకాలం పూర్తి కానున్నాయని అన్నారు. అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఇవాళ చివరి రోజు భారీగా నమోదయ్యాయి నామినేషన్లు. 15న మునిసిపాలిటీ, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు స్వంత నియోజకవర్గం అయిన కుప్పం, నెల్లూరు కార్పోరేషన్ పైనే అందరి ఫోకస్ పడింది. కుప్పంలో పాగా వేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. అక్కడ ఎలాగైనా పరువు నిలుపుకోవాలని టీడీపీ నేతలు పట్టుమీద వున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…