పోర్టులపై అధికారం రాష్ట్రానిదే.. కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని అంగీకరించం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటుపై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇండియన్ పోర్ట్స్ డ్రాఫ్ట్ బిల్లు 2020పై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు.. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ మంత్రి.. బిల్లును అధ్యయనం చేసి పూర్తిస్థాయిలో అభ్యంతరాలు చెప్పటానికి నెల రోజుల సమయాన్ని కేంద్రానికి అడిగినట్టు తెలిపారు.. పోర్టులు ఉమ్మడి జాబితాలో లేవని వ్యాఖ్యానించిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కానంత వరకు కేంద్రానికి పూర్తిస్థాయిలో సహకరించటానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు.. తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖపై స్పందిస్తూ.. స్టాలిన్ లేఖలోని అంశాలను మేం ఏకీభవిస్తున్నామని తెలిపారు.. అవసరమైతే తీర ప్రాంత రాష్ట్రాలతోనూ మాట్లాడతామన్న గౌతమ్‌రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటు పై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని ఎట్టిపరిస్థిల్లో అంగీకరించేది లేదన్నారు.. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్పష్టం చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
తాజావార్తలు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!