హైదరాబాద్‌లో కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఇవాళ నెల్లూరుకు తరలించనున్నారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం ఉండగా.. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని తరలిస్తారు.. బేగంపేటఎయిర్…
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో వైసీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. సోమవారం రాత్రి వరకు అక్కడే ఉంచి అనంతరం స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. బుధవారం నాడు మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు అమెరికాలో చదువుతుండటంతో అతడు వచ్చాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబీకులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రాజకీయ నేతలతో…
ఏపీ ప్రభుత్వం నేడు ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ వర్క్ షాప్’ అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రిలు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు హజరయ్యారు. వీరితో పాటు డీఆర్‌డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ శాఖ అధికారులు వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని వాటిపై చర్చించినట్లు తెలిపారు.…
పాలిసెట్ 2021 ఫలితాలు విడుదల చేసారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి. సెప్టెంబర్ 1న పరీక్ష నిర్వహణ జరిగిన ఈ పరీక్షకు 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా 64వేల మంది అర్హత సాధించారు. అంటే 100 శాతానికి 94.21% అర్హత సాధించారు. ఈ పరీక్షలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించింది శ్రీకాకుళం జిల్లా. అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం ఉంది నెల్లూరు జిల్లాలో కాగా అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం ప్రకాశం జిల్లాలో ఉంది…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తూనే ఉంది.. ఏ క్షణంలోనైనా విశాఖకు రాజధాని తరలిపోవచ్చు అని చెబుతూ వస్తున్నారు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. అయితే, ఇవాళ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో కలిసి పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని…
రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటుపై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇండియన్ పోర్ట్స్ డ్రాఫ్ట్ బిల్లు 2020పై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు.. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ మంత్రి.. బిల్లును అధ్యయనం చేసి పూర్తిస్థాయిలో అభ్యంతరాలు చెప్పటానికి నెల రోజుల సమయాన్ని కేంద్రానికి అడిగినట్టు తెలిపారు.. పోర్టులు ఉమ్మడి జాబితాలో…
గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాలను తమకు అప్పగించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది అదానీ గ్రూప్.. దీనిపై అధ్యయనానికి ఉన్నతస్థాయిలో అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. దీంతో.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ గ్రూప్‌కు వెళ్లిపోతుందనే ప్రచారం ఊపందుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ సంస్థకు వెళ్లి పోతుందన్నది అవాస్తవం అన్నారు.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటి నుంచి…