ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తప్పిన ప్రమాదం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇవాళ గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సురేష్.. అనంతరం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటికి వెళ్లారు మంత్రి.. అయితే, ఆ ఇంట్లో కూర్చుంటున్న సమయంలో.. తుల్లిపడబోయారు.. అప్రమత్తమై వైసీపీ నేతలు.. వెంటనే ఆయన్ను పట్టుకోవటంతో ప్రమాదం తప్పినట్టు అయ్యింది. కాగా, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మంత్రి సురేష్.. ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఇవాళ కిందపడబోయి తృటిలో తప్పించుకున్నారు..
Read Also: Off The Record: రెండుగా చీలిపోయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు..?
కాగా, ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.. మోకాలికి శస్త్రచికిత్స కావడంతో ఆ మధ్య వీల్ చైర్‌లోనే బయటకు వచ్చారు.. గడప గడపకు మన ప్రభుత్వం పాల్గొన్న విషయం విదితమే. ఆ మధ్య ఆదిమూలపు సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. మంత్రికి ఏమైందని అందరూ ఆందోళన వ్యక్తం చేయగా.. మోకాలికి సర్జరీ జరిగినట్లు క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా తన యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.. ఇక, మళ్లీ ప్రజల మధ్యకు వచ్చినా.. ఇవాళ్టి ఘటనతో కొంత ఆందోళనకు గురయ్యారు.