Raviteja: మాస్ మహారాజా రవితేజ.. హిట్ కాంబోను ఎప్పుడు వదిలిపెట్టడు. ఒక ప్లాప్ వచ్చింది అంటే.. దాన్ని కవర్ చేయడానికి మరో హిట్ కాంబోను దించేస్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో రెండు హిట్లు ఒక ఫ్లాప్ ను మూటకట్టుకున్న రవితేజ.. మరో రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. టైగర్ నాగేశ్వరరావు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈగల్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా మాస్ మాహారాజా మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. తనకు హ్యాట్రిక్స్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ ఏడాది మైత్రీ- గోపీచంద్ కాంబోలో వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యి ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ధమాకా సినిమా వచ్చిన విషయం తెల్సిందే. గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రవితేజ- శ్రీలీల డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఎలాగో హిట్ కాంబోను రిపీట్ చేస్తున్నామని.. రవితేజ.. శ్రీలీలతో మరోసారి జతకట్టేద్దామని ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిన్నదాని చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందరు స్టార్ హీరోలే.. ఇక ఇప్పుడు ఆ ఖాతాలో మరోసారి రవితేజ చేరాడు. ఈసారి ఈ కాంబో ఏ రేంజ్ లో అలరించనున్నదో చూడాలి.