ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన అందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ జీవో నెంబర్ 5ను ఏపీ ప్రభుత్వం శనివారం నాడు విడుదల చేసింది. అంతేకాకుండా ప్రొబేషన్ పూర్తి అయిన వారికి జీత భత్యాలను కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
అటు సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్‌ను ఖరారు చేస్తూ కూడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీల పే స్కేల్‌ను రూ.23,120 నుంచి రూ.74,770కు, ఇతర సచివాలయ ఉద్యోగుల పే స్కేల్‌ను రూ.22,460 నుంచి రూ.72,810 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ను ప్రభుత్వం డిక్లేర్ చేయటం సంతోషకరమన్నారు. వారందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నట్లు పేర్కొన్నారు.
Kakani Govardhan Reddy : 2024లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర తిరగరాస్తాం