ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన అందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ జీవో నెంబర్ 5ను ఏపీ ప్రభుత్వం శనివారం నాడు విడుదల చేసింది.…